Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్..! 11 d ago

8K News-08/04/2025 దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమైయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు, ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ.. దిగ్గజ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో సూచీలు రాణిస్తున్నాయి. సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ ప్రారంభించగా.. నిఫ్టీ మళ్లీ 22,500 మార్క్ను అందుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 1180.73 పాయింట్లు ఎగబాకి 74,318.63 వద్ద, నిఫ్టీ 361 పాయింట్ల లాభంతో 22,522.60 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.